రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు


రోల్‌ప్లే పోటీల్లో రాజ్‌పల్లి పాఠశాలకు ప్రథమ స్థానం
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
మెదక్, బ్యూరో .అక్టోబర్.29 (మంజీర మెరుపు)
మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి రోల్‌ప్లే పోటీలు నిర్వహించారు. బాలల హక్కులు, బాలల రక్షణలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొని విలువలు, ఆరోగ్యం, సమానత్వం, భద్రత వంటి అంశాలపై ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.
రాజ్‌పల్లికి ప్రథమ స్థానం
ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజ్‌పల్లి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హవేలీ ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం, కేజీబీవీ కొల్చారం విద్యార్థులు తృతీయ స్థానం సాధించారు. విజేతలకు జిల్లా విద్యాశాఖాధికారి రాజు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, న్యాయనిర్ణేతలు రామేశ్వర ప్రసాద్, అంజాగౌడ్, స్టెలా, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
